Surya Daily January 30, 2014
రాగ ద్వేషాలకు అతీతంగా, విజ్ఞతతో ఆలోచిస్తే
ఎంతటి సమస్యకైనా పరిష్కా రం లభిస్తుంది. నేటి వివాదానికి బీజం వేసింది-
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను పైలెట్ చేస్తున్న కేంద్ర
హోం శాఖ కార్యదర్శి. బిల్లు అసమగ్రంగా ఉన్నది, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ
చేయాలంటే సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వండని శాసనసభ్యులు చేసిన అభ్యర్థనను
కేంద్ర హోంశాఖ కార్యదరిి్శ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి పంపితే,
ఆయన- ఇది కేవలం ముసా యిదా బిల్లే- అని పునరుద్ఘాటించడంతో వివా దానికి
తెరలేచింది. సమగ్రమైన సమాచారాన్ని పార్లమెంటుకు సమర్పిస్తాం. శాసన సభకు ఆ
సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అత్యంత బాధ్యతారహితంగా సమాధానం
చెప్పడం- శాసనసభను, శాసన మండలిని అవమానపరచ డమే. అలాగే బిల్లు,
ముసాయిదాబిల్లు- ఏదైనా ఒకటేననడం బాధ్యతారాహిత్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3
లో బిల్లు అని ప్రస్తావించారే గానీ ముసాయిదా బిల్లు అని పేర్కొనలేదు.
కేంద్ర మంత్రి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే వివాదానికి మరింత ఆజ్యం
పోసిన వారవుతారు. న్యాయస్థానాల ముందు ఇలాగే వాదిం చగలరా? పైకి చూడడానికి-
బిల్లు లేదా ముసాయిదా బిల్లు ఒక్కటే అనిపించ వచ్చు. కానీ ముసాయిదా బిల్లు
సమగ్రరూపం దాల్చిన తరువాత బిల్లుగా రూపాంతరం చెందుతుంది. ముసాయిదా బిల్లును
కేంద్ర హోంశాఖ తయారుచేసి, కేంద్ర మంత్రిమండలి ముందుంచి, ఆమోదంపొందిన
బిల్లునే రాష్టప్రతిద్వారా రాష్ట్ర శాసన సభ, శాసన మండలికి పంపాలి. దానిపై
అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. బిల్లుకు పార్లమెంటు సభ్యులుకానీ లేదా
పార్లమెంటులో చర్చలప్రక్రియలో అంతర్భాగంగా ప్రభుత్వం అధికారికంగా కానీ
సవరణలు ప్రతిపాదించవచ్చు.
వాటిని ఆమోదించడమో లేదా తిరస్కరించడమో
జరిగిన మీదట బిల్లును చట్టసభ ఆమోదిస్తే, అది చట్టంగా రూపొందుతుంది. దానిపై
రాష్టప్రతి రాజ ముద్ర పడ్డాక అమలులోకి వస్తుంది. ఈ ప్రక్రియపై కనీస
పరిజ్ఞానం కూడా లేకుండా కేంద్ర మంత్రివర్యులు, చట్టసభల సభ్యులు
మాట్లాడుతున్నారని భావించలేం కదా!శాసన సభకు/ శాసన మండలికి పంపిన బిల్లు
సమగ్రంగా లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. సమగ్రంగాఉన్నదని కొందరు
వాదించవచ్చు. సమగ్ర సమాచారం లేదన్న వాదనలో బలం ఉన్నది కాబట్టే- కేంద్ర హోం
శాఖ కార్యదర్శి విధిలేని పరిస్థితుల్లోనే ముసాయిదా బిల్లు అని పేర్కొని
తప్పించుకోవాలని చూశారు. అది కాస్త నిజాయితీతో కూడిన మాటే. కానీ, అదే
వివాదానికి తెరలేపిం ది. కేంద్ర మంత్రిమండలి రాజకీయ ప్రయోజనాలతో ఎన్నికలకు
ముందు హడావు డిగా, అడ్డగోలుగా వ్యవహరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనడానికి మన
రాష్ట్ర విభజన ఉదంతమే ప్రబల నిదర్శనం.
భాతర రాజ్య స్వభావం- సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థ. భారత యూనియన్‌లో అంతర్భాగ మైన రాషా్టల్రు స్వయంప్రతిపత్తి కలిగిఉన్నాయి. కేంద్రప్రభుత్వం, రాషా్టల్రకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను క్రమంగా హరించివేస్తూ వస్తున్నది.
సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా రాషా్టల్ర చట్టసభ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టే రాజ్యాంగసభలో ఈ అంశంపై లోతైనచర్చ చేశారు. బ్రిటిష్ వలసపాలనలో ఉన్న ప్రావిన్సెస్‌కు, భారత యూనియన్ లోని రాషా్టల్రకు మధ్య మౌలిక తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆర్టికల్ మూడుపై జరిగిన చర్చలో విస్ఫష్టంగా పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం సమాఖ్యవ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి వేటుకు గురిచేయడానికి తెగిస్తే ప్రతిఘటించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసంఉన్న ప్రతి పౌరుడిపై ఉన్నది. లేకుంటే దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి ప్రజలచేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి రాష్టప్రతి పాలన విధిస్తే- అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి, కట్టడి చేసిన దృష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించకుండా ఉండలేదు. ఏ సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో పరిష్కరించు కోవలసిందే. మరో మార్గం లేదు. రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక, గత 6 దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.
రాషా్టల్ర పునర్ వ్యవస్థీకరణపై రాజ్యాంగం: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం వరకేగానీ, ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. భారత రాజ్యాంగంలో సమాఖ్యవ్యవస్థ పరిరక్షణఅంశం అంత బలహీనంగా ఉన్నదా అన్న అనుమానం వస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్టప్రతి ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవలం కంఠశోష వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్ 3 ఏం చెబుతున్నదో పైన పేర్కొనడం జరిగింది. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్రమాత్రమే. తనకుతానుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలులేదని స్పష్టమవు తున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి బరితెగిస్తే, రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు రంగప్రవేశం చేయకతప్పదు. అంబేడ్కర్ ప్రతిపాదిం చిన సవరణలను రాజ్యాంగసభ ఆమోదించింది.
1)రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని దఖలు పరుస్తూ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్టప్రతి సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. 2) రాష్టప్రతి అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్ సంబంధిత శాసన సభ/ శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి. తద్వారా సంబంధిత రాష్ట్ర శాసనసభ నుండే ఈఅంశానికి సంబంధించిన ప్రస్తావనరావాలి లేదా చొరవ ప్రదర్శించాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి వీలులేదు.3) భారత దేశంలోని రాషా్టల్రకు స్వయం ప్రతిపత్తి ఉన్నది.
రాషా్టల్ర సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై సంబంధిత రాషా్టల్ర నుండి అనుమతి పొందాలి. భారత యూనియన్ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్‌న రాషా్టల్రకు, ప్రావిన్సెస్‌కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను అంబేడ్కర్ నొక్కి వక్కాణించారు. ఈ అంశాలను పరిశీలిస్తే- రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి విలువఉం టుందని బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తంచేసే అభిప్రా యాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్టప్రతి తృణీకారభావంతో తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణతో ముడిపెట్టకుండా నిష్పాక్షిక దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి. చట్టసభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకగా తమ పనివిధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ ప్రగతికి బాటలువేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటాయి. వైవిధ్యభరితమైన మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత రాజ్యాంగానికి వర్గస్వభావం ఉన్నది, తదనుగుణంకగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడిఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థకోసం అడుగులు ముందుకు వేయాలి. బహుళపార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. చట్టసభలు పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షకు, అశాంతికి, అభివృద్ధి నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లవుతుంది.
తెలుగునాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజనసమస్య దేశం ముందుకొచ్చింది. ఈ సమస్యకు హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన పరిష్కారానికి చిత్తశుద్ధితో అన్వేషణ జరగాలి, పరిష్కరించాలి. అదే సందర్భంలో ఈ వివాద పరిష్కారం మరెన్నో సమస్యల ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. నేడు తెలుగు ప్రజల మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెస్‌పార్టీ, దాని నాయకత్వంలోని యుపిఎ- ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించాయనడం నిస్సందేహం. చట్ట సభలో విభజన అంశం అజెండాలో కొచ్చినప్పుడు సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్య ప్రధాన లక్షణం.