Thursday, February 5, 2015

'ప్యాకెజీ...తొలి అడుగు' శీర్షికతో ఈటీవి ప్రతిధ్వని, పిబ్రవరి 6,2015


అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వర్ణనాతీతమైన కష్టాల పాలైనారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి, వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, రాష్ట్ర రాజధానీ నిర్మాణానికి నిథులు, రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని రెవెన్యూ లోటు మేరకు ఆర్థిక సహాయం వగైరా చట్టబద్ధమైన హామీలిచ్చారు. తెలుగు జాతిని నిట్టనిలువునా చీల్చిన‌ కాంగ్రెసును ప్రజలు భూస్థాపితం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన‌ బిజెపి గద్దెనెక్కింది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన మేరకు మరియు చట్ట సభ అయిన రాజ్యసభలో ఇచ్చిన వాగ్ధానాలకు కట్టుబడి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు పూనుకొని, అవసరమైన నిథుల కేటాయించాల్సిన గురుతర బాధ్యత‌ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రనిరాశ కల్గిస్తూ, అరకొర నిథుల కేటాయింపు, పారిశ్రామికాభివృద్ధి పేరుతో లోపభూయిష్టమైన ఒకటి, రెండు రాయితీలు ప్రకటించడం గర్హనీయం.
ఈ అంశంపై ఈటీవి ప్రతిధ్వని చర్చాకార్యక్రమంలో నాతో పాటు టిడిపి నాయకులు చందు సాంబశివరావు గారు, రాజకీయ మరియు ఆర్థికాంశాల విశ్లేషకులు సి.నరసింహారావు గారు, బిజెపి నాయకులు వై. రఘునాథబాబు గారు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=FONqCjowwaE

No comments:

Post a Comment