తెలంగాణ వైశాల్యం: 1,62,970 చదరపు కి.మీ. వైశాల్యం రీత్యా
దేశంలో 8వ పెద్ద రాష్ట్రం.
అడవుల విస్తీర్ణం: 36,909.36 చ.కి.మీ.
జనాభా: 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674.
పురుషులు 1,76,11,633, స్త్రీలు 1,73,92,041, పిల్లలు 38,99,166. దళితులు
54,08,800(15.45%), గిరిజనులు 31,77,940(9.08%)
*గ్రామీణులు
2,13,95,009
*పట్టణ
జనాభా 1,36,08,665(38.88%). జాతీయ స్థాయి పట్టణ జనాభా సగటు 31.15%
*జనాభా
వృద్ధి రేటు 13.58%, జాతీయ స్థాయిలో 17.69%
*జనసాంద్రత 312, జాతీయ స్థాయిలో 382
*స్త్రీ,
పురుష నిష్పత్తి 988:1000, జాతీయ స్థాయిలో 943:1000
కుటుంబాల సంఖ్య: 83,03,612
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.): స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి వృద్ధి రేటు రాష్ట్ర
ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యం, స్థితి గతులపై స్థూలమైన అవగాహన కల్పిస్తుంది. కేంద్ర
గణాంకాల కార్యాలయం(సి.యస్.ఓ.) స్థిర ధరల ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05 నుండి
2011-12కు మార్చడంతో పాటు స్థూల దేశీయోత్పత్తి(జి.డి,పి.) గణన విధానాన్ని కూడా మార్చింది.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ అధికారిక గణాంకాల మేరకు ప్రస్తుత
ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్ఫత్తి(జి.యస్.డి.పి.) 2015-16 ఆర్థిక సంవత్సరంలో
రు.5.76 లక్షల కోట్లు, 2016-17 లో ముందస్తు అంచనాల ప్రకారం రు.6.54 లక్షల కోట్లు. వృద్ధి
రేటు 13.7%. స్థిర ధరల్లో (2011-12) 2015-16లో రు.4,64,389 కోట్లు ఉంటే 2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.5,11,286
కోట్లు. దీని ప్రకారం వృద్ధి రేటు 10.1%.
దేశీయ
స్థూల ఉత్ఫత్తి(జిడిపి)లో తెలంగాణ వాటా 2015-16లో 4.21% అయితే 2016-17లో 4.28%కు పెరిగింది.
దేశీయ స్థూల ఉత్ఫత్తి 2015-16లో స్థిర ధరల ప్రకారం రు.1,13,57,529 కోట్లుగా ఉంటే
2016-17లో రు.1,21,65,481కోట్లకు పెరిగింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 2015-16లో
7.9% ఉంటే 2016-17లో 7.1% కు పడి పోయింది.
స్థూల జిల్లాల దేశీయ ఉత్ఫత్తి(జిడిడిపి): 2015-16లో హైదరాబాదు జిల్లా రు.1,36,388
కోట్లు. రంగారెడ్డి జిల్లా రు.82,359 కోట్లు. మేడ్చల్-మల్కాజ్ గిరి రు.47,604 కోట్లు.
హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి, ఈ నాలుగు జిల్లాల జిడిడిపి
మొత్తం తెలంగాణ రాష్ట్ర జి.యస్.డి.పి.లో 52%గా ఉన్నది. దీన్ని బట్టి రాష్ట్ర రాజధాని
చుట్టే ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయన్న విషయం స్పష్టమవుతున్నది.
ఆర్థిక వనరుల వర్గీకరణ: ఆర్థిక వ్యవస్థను స్థూలంగా మూడు విభాగాలుగా
వర్గీకరించుకొని విశ్లేషించుకోవడం జరుగుతున్నది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను
ప్రాథమిక రంగంగాను, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగాను, సేవా రంగాన్ని తృతీయ రంగంగాను
పరిగణిస్తున్నారు. రంగాల వారిగా జి.యస్.డి.పి.లో వాటాను పరిశీలిస్తే ప్రాథమిక రంగం
18%, ద్వితీయ రంగం 19%, తృతీయ రంగం దాదాపు 63%. స్థూల రాష్ట్ర అదనపు విలువ(జి.ఎస్.వి.ఎ.)
వృద్ధి రేటును పరిశీలిస్తే, ప్రస్తుత ధరల ప్రకారం 2016-17లో వ్యవసాయం మరియు దాని అనుబంధ
రంగాల్లో 17.2%, పారిశ్రామిక రంగంలో 9.8%, సేవా రంగంలో 14.6% గా నమోదయ్యే అవకాశం ఉన్నది.
ఇదే కాలానికి సంబంధించి జాతీయ స్థాయిలో ముందస్తు అంచనాల మేరకు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ
రంగాల్లో 9%, 8.7%, 11.9%గా ఉన్నది.
తలసరి ఆదాయం(పి.సి.పి.): ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలను
అంచనా వేయడానికి సాధారణంగా తలసరి ఆదాయాన్ని మెరుగైన కొలబద్ధగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి.
ప్రస్తుత ధరల్లో 2015-16లో రు.1,40,683 ఉంటే 2016-17లో ముందస్తు అంచనాల ప్రకారం రు.1,58,360
కు పెరిగి 12.6% వృద్ధిని తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. జాతీయ స్థాయిలో
రు.94,178 నుండి రు.1,03,818 లకు పెరిగి, వృద్ధి రేటు 10.2%గా నమోదయ్యింది. తలసరి ఆదాయంలో
కూడా హైదరాబాదు రు.2,99,997, రంగారెడ్డి రు. 2,88,408, సంగారెడ్డి రు. 1,69,481, మేడ్చల్-మల్కాజ్
గిరి రు.1,62,327. 18 జిల్లాల్లో తలసరి ఆదాయం రు.1,00,000 లోపు ఉంటే 14 జిల్లాలలో జాతీయ
తలసరి ఆదాయం కంటే తక్కువగా రు.94,178 ఉన్నది.
*నా వ్యాఖ్య: జనాభా సంఖ్యతో స్థూల దేశీయోత్ఫత్తి(జి.డి.పి.)ని
విభజించి, తలసరి ఆదాయాన్ని లెక్కించే విధానం అమలులో ఉన్నది. ప్రజల ఆర్థికాభివృద్ధి,
జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి, తలసరి ఆదాయాన్ని ప్రామాణికమైన కొలబద్ధగా పరిగణించడం
అశాస్త్రీయమైనది. మానవాభివృద్ధి నివేదికను
ప్రామాణికంగా తీసుకొని, ప్రజల ఆర్థికాభివృద్ధిని, జీవన ప్రమాణాలను హేతుబద్ధంగా అంచనా
వేస్తే శాస్త్రీయంగా ఉంటుంది. జి.డి.పి. పెరిగితే, ఉపాథి కల్పనావకాశాలు పెరుగుతాయన్న
భావనకు కాలం చెల్లిపోయింది. గడచిన కొన్ని సంవత్సరాల అనుభవాలను విశ్లేషించుకొంటే జిడిపి
పెరుగుదలకు, ఉపాథి కల్పనకు పొంతన లేదని స్పష్టమవుతున్నది.
ఉపాథి కల్పన: కార్మిక శాఖ ప్రచురించిన ఉపాథి - నిరుద్యోగ
అధ్యయన నివేదిక(2015-16) ప్రకారం తెలంగాణలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలోనే అత్యధిక
మంది కార్మికులు శ్రమిస్తున్నారు, అటుపై సేవా మరియు పారిశ్రామిక రంగాలలోఉపాథి పొందుతున్నారు.
*జి.యస్.డి.పి.లో
వ్యవసాయ రంగం వాటా 2015-16లో 14.7% మాత్రమే అయినా 54% మంది ఉపాథి పొందుతున్నారు. 2013-14
గణాంకాలతో పోల్చి చూస్తే 2015-16 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఉపాథి
పొందుతున్న వారి సంఖ్య 1.8% తగ్గింది. ఆ మేరకు పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక మరియు
సేవా రంగాల్లో ఉపాథి కల్పన పెరిగింది.
*జి.యస్.డి.పి.లో
62% వాటా ఉన్న సేవా రంగంలో మొత్తంగా చూస్తే 28%, పట్టణ ప్రాంతాల వరకే పరిగణలోకి తీసుకొంటే
64% మందికి ఉపాథి కల్పిస్తూ అగ్రభాగాన నిలిచింది.
కార్మిక జనాభా నిష్పత్తి: 15 సం.లకు పైబడిన వయస్సు ఉన్న కార్మిక
శక్తి భాగస్వామ్య నిష్పత్తిని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 63%, పట్టణ ప్రాంతాల్లో
49.1%, రాష్ట్రం మొత్తంగా 58.1%గా ఉన్నది.
నిరుద్యోగ నిష్పత్తి: గ్రామీణ ప్రాంతాల్లో 1.2%, పట్టణ ప్రాంతాల్లో
6.1%, రాష్ట్రం మొత్తంగా 2.7%గా 2015-16లో నమోదయ్యింది. జాతీయ స్థాయిలో 3.7% ఉన్నది.
ద్రవ్యోల్భణం: వినిమయ వస్తువుల ధరల సూచిక(పారిశ్రామిక
కార్మికులు) గణాంకాలను పరిశీలిస్తే 2011-12 నుండి 2016-17 మధ్య కాలంలో క్రమేపీ తగ్గుముఖం
పట్టింది. 2013-14లో 10.2% ఉన్న ద్రవ్యోల్భణం 2.23% తగ్గింది. జాతీయ స్థాయికి అనుగుణంగానే
ఈ తగ్గుదల ఉన్నది.
దృక్పథం: సూక్ష్మ ఆర్థిక మూల సూత్రాల ఆధారంగా పరిశీలిస్తే
తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు, పన్ను వసూళ్ళు, ద్రవ్యోల్భణం మరియు ఉపాథి కల్పన అంశాలలో
గతం కంటే శక్తివంతంగా ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుండి జి.యస్.డి.పి. పెరుగుదల
వైపు నడక ఉన్నది. 2016-17 ఆర్థిక సం.లో రెండంకెల వృద్ధి రేటుతో రాష్ట్ర సొంత పన్ను
వనరుల ద్వారా సమకూరే ఆదాయం అధికమవుతుంది. గడచిన రెండేళ్ళుగా మిగులు రెవెన్యూ రాబడి
ఉన్నకొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ఉన్నది.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ: రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా
పునర్ వ్యవస్థీకరించడం జరిగింది. 1. హైదరాబాద్, 2. అదిలాబాద్, 3. భద్రాద్రి-కొత్తగూడెం,
4. జగిత్యాల్, 5. జనగాం, 6. జయశంకర్, 7. జోగులాంబ_గద్వాల్, 8. కామారెడ్డి, 9. కరీంనగర్,
10. ఖమ్మం, 11. కుమురం భీం, 12. మహబూబాబాద్, 13. మహబూబ్ నగర్, 14. మంచిర్యాల్, 15.
మెదక్, 16. మేడ్చల్, 17. నాగర్ కర్నూల్, 18. నల్లగొండ, 19. నిర్మల్, 20. నిజామాబాద్,
21. పెద్దపల్లి, 22. రాజన్న సిరిసిల్ల, 23. రంగారెడ్డి, 24. సంగారెడ్డి, 25. సిద్దిపేట్,
26. సూర్యాపేట, 27. వికారాబాద్, 28. వనపర్తి, 29. వరంగల్ (రూరల్), 30. వరంగల్ (అర్బన్),
31. యాదాద్రి భువనగిరి.
*
స్థానిక
సంస్థలు: మొత్తం గ్రామ
పంచాయితీల సంఖ్య 8,695. మండలాల సంఖ్య 584కు పెరిగింది.
భూమి: మొత్తం భూ విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణం
2015-16లో 37.3%, అడవుల విస్తీర్ణం 22.7%, ప్రస్తుతం బీడుగా ఉన్న భూములు 5.4%, వ్యవసాయేతర
ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూమి దాదాపు 8%, వ్యవసాయానికి పనికిరాని భూమి 1.6%, శాశ్వత
పచ్చిక బయళ్ళు, మైదానాలు 2.7%, పండ్ల తోటలు, చెట్లు, పొదలు ఉన్న భూమి 1%, ప్రస్తుతం సాగులో లేని భూమి 14%, సాగులో లేని ఇతర
భూములు 7.3%.
భూమి
కమతాలు: సగటు భూమి కమతాల
విస్తీర్ణం 2005-06లో 1.30 హెక్టార్లు ఉంటే 2010-11 నాటికి 1.12 హెక్టార్లకు తగ్గింది.
వర్షపాతం: సగటు వర్షపాతం 713.5 మి.మీ. లభించాల్సి
ఉండగా 2016-17లో 912 మి.మీ. నమోదయ్యింది. 2015-16లో 611.2 మి.మీ. నైరుతీ రుతు పవనాల
ద్వారా 28% అధికంగా వర్షపాతం నమోదయ్యింది.
సాగుదల: 2014-15 గణాంకాలను పరిశీలిస్తే బావుల
మీద ఆధారపడిన సాగు దాదాపు 84%గా ఉంటే కాలువల ద్వారా 10%, చెరువుల క్రింద 4%గా ఉన్నది.
వ్యవసాయ రుణాలు: రాష్ట్ర ప్రభుత్వ రుణ ప్రణాళిక ప్రకారం
2016-17లో రు.90,776 కోట్లు. అందులో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.29,101 కోట్లు.
2015-16లో పంట రుణాల మంజూరు లక్ష్యం రు.27,800 కోట్లకు గాను రు.23,400 కోట్లు మంజూరు
చేశారు.
విద్యుత్తు రంగం: 2016 డిసెంబరు 31 నాటికి
5235.26 మెగా వాట్స్ విద్యుత్ ఉత్ఫాదనా సామర్థ్యం
కలిగి ఉన్నది. ఇందులో థర్మల్ విద్యుత్తు 2882.5 మె.వా., జల విద్యుత్తు 2351.7 మె.వా.,
సోలార్ 1 మె.వా. ప్రస్తుతం 5,880 మె.వా. ఉత్పాదక సామర్థ్యంతో విద్యుత్తు ప్రాజెక్టులు
నిర్మాణంలో ఉన్నాయి.
*తలసరి
విద్యుత్తు వినియోగం 2015-16లో 1439 యూనిట్స్ గా ఉన్నది. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం
2014-15లో 1,010 యూనిట్స్.
ప్రధానమైన ఆరోగ్య గణాంకాలు: ప్రసూతి మరణాల రేటు - MMR(లక్ష సజీవ జననాలకు)
92 ఉంటే జాతీయ స్థాయిలో 167. శిశు మరణాల రేటు- IMR(1000 సజీవ జననాలకు) 28 ఉంటే జాతీయ స్థాయిలో 41. పురుషుల, స్త్రీల
నిష్పత్తి 1000:980 ఉంటే జాతీయ స్థాయిలో 1000:940. జననాల రేటు 18 ఉంటే జాతీయ స్థాయిలో
21. మరణాల రేటు జాతీయ స్థాయితో సరిసమానంగా
6.7 ఉన్నది.
ప్రజారోగ్యం మౌలిక సదుపాయాలు:
ఉప కేంద్రాలు 4797, ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలు 876, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 107, ప్రాంతీయ ఆసుపత్రులు 31, జిల్లా
ఆసుపత్రులు 7, డాక్టర్, రోగుల నిష్పత్తి 1:1700
అక్షరాస్యత: 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో
ఏడు సంవత్సరాల వయసుకు పైబడ్డ జనాభా 3,11,04,508. పురుషులు 1,55,93,698, మహిళలు
1,55,10,810. వీరిలో అక్షరాస్యులు 2,06,96,778(66.5%). జాతీయ సగటు 72.9% కంటే తక్కువగా
ఉన్నది. తెలంగాణలోని పట్టణాలలో 81% ఉంటే, గ్రామాలలో 57%గా ఉన్నది. పురుషుల్లో 75%,
మహిళల్లో 57.9%గా ఉన్నది. షెడ్యూల్డ్ కులాలలో 58.9%, గిరిజనుల్లో 49.5% గా ఉన్నది.
*వయస్సు
పరంగా వర్గీకరణ: 7 నుండి 24 సం.ల మధ్య వయస్సు ఉన్న వారిలో 88.56%. ఇది జాతీయ స్థాయి
86.98% కంటే ఎక్కువ. 18-24 సం.ల మధ్య వయస్సు ఉన్న పురుషుల్లో 90%, మహిళల్లో 79.5% అక్షరాస్యత
ఉన్నది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న 89.3%, 79.1% కంటే ఎక్కువ. జాతీయ స్థాయిలో 24 సం.ల
దాటిన వయస్సు వాళ్ళ అక్షరాస్యత తెలంగాణ కంటే ఎక్కువగా ఉంటే యువతలో 9% అధికంగా తెలంగాణలో
ఉన్నది.
*హైదరాబాదు
83.25%తో జిల్లా అగ్రస్థానంలో ఉంటే, 49.87% తో జోగులాంభ - గద్వాల్ జిల్లా చివరి స్థానంలో
ఉన్నది. మొత్తం 31 జిల్లాలలో 26 జిల్లాలు రాష్ట్ర సగటు అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్నాయి.
హైదరాబాదు 83.25%, మేడ్చల్ 82.49%, వరంగల్ అర్బన్ 76.17%, రంగారెడ్డి 71.95%, కరీంనగర్
69.16% తో రాష్ట్ర సగటు కంటే పై స్థాయిలో ఉన్నాయి.
*2011
జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యుల్లో 48.6% మంది మాధ్యమిక పాఠశాల విద్యకు లోపు,
17.9% విశ్వవిద్యాలయ విద్యకు లోపు, 1.6% సాంకేతిక డిప్లొమా విద్య, 0.3% సాంకేతికేతర
డిప్లొమా విద్య, 21.9% డిగ్రీ మరియు ఆ పై విద్యార్హత, 0.9% వర్గీకరణ చేయని విద్య,
8.8% విద్యార్హతలు లేని అక్షరాస్యులు.
విద్యా రంగం: ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు
41,337 ఉన్నాయి. వాటిలో 70% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలలు.
28% ప్రయివేటు పాఠశాలలు. కేంద్రీయ పాఠశాలలు 1%. ప్రభుత్వ ఆర్థిక సహాయంలేని(అన్ ఎయిడెడ్)
పాఠశాలలు 2% ఉన్నాయి. హైదరాబాదులోనే 6,048 పాఠశాలలు ఉన్నాయి. జోగులాంభ -గద్వాల్ జిల్లాలో
మాత్రమే 716 ఉన్నాయి.
మొత్తం
పాఠశాలల సంఖ్యలో 70% గా ఉన్న ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాలల్లో
మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 55% మంది, 30% గా ఉన్న ప్రయివేటు పాఠశాలల్లో 45% మంది ఉపాధ్యాయులు
పని చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి
హేతుబద్ధంగా లేదని స్పష్టమవుతున్నది.
*విద్యార్థుల
నమోదు: 2016-17 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు 60.63 లక్షల మంది. ఇందులో 52%
పిల్లలు ప్రయివేటు పాఠశాలల్లోను, 45% ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల యాజమాన్యంలోని
పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకొన్నారు. అన్ ఎయిడెడ్ పాఠశాలలో 2%, కేంద్రీయ పాఠశాలలో
1% గా ఉన్నది. ప్రీ - ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు
17,08,975, IX-X తరగతులు 10,48,814,
XI-XII తరగతులు 32,670, మొత్తం 60,33,196.
*6-10
మధ్య వయస్సు పిల్లల్లో 102.48%, 11-13 వయస్సు వారిలో 90.34%, 14-15 వయస్సు వారిలో
80.2% నమోదయ్యారు.
*చదువును అర్థాంతరంగా మానేస్తున్న
పిల్లలు: I – V తరగతుల
మధ్య బడి మానేసే పిల్లల సంఖ్య 2014-15లో 37.56% గా ఉంటే 2016-17 నాటికి 34.70% కు
తగ్గింది. ప్రీ _ ప్రైమరి 1,33,740, I-V తరగతులు 31,08,997, VI-VIII తరగతులు
17,08,975 IX-X తరగతులు 10,48,814, XI-XII
తరగతులు 32,670, మొత్తం 60,33,196.
I
– V అబ్బాయిలు 16.30%, అమ్మాయిలు15.70%, మొత్తం 16%, VI-VIII తరగతులు అబ్బాయిలు
30.61%, అమ్మాయిలు 29.24%, మొత్తం 29.95%,
IX-X తరగతులు అబ్బాయిలు 35.50%, అమ్మాయిలు 33.84%, మొత్తం 34.7%.
ఇంటర్ మీడియేట్ విద్య: రాష్ట్రంలో ఇంటర్ మీడియేట్ మరియు హైయర్
సెకండరీ విద్యా సంస్థులు 2,537 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 404, ప్రయివేట్
ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 41, ప్రయివేటు జూనియర్ కళాశాలలు 2,092 ఉన్నాయి. రెండు సంవత్సరాల
విద్యార్థుల సంఖ్య 6.9 లక్షల మంది ఉన్నారు.
ఉన్నత విద్య: 4.26 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశం
కల్పించ గల సామర్థ్యంతో 1,196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 130 ప్రభుత్వ కళాశాలలు,
69 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 84,068, ఎయిడెడ్ కళాశాలలు
59,338 మందికి ప్రవేశం కల్పించబడింది.
విద్యార్థి వసతి గృహాలు: షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన
కులాలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు నిర్విఘ్నంగా విద్యార్జనను కొనసాగించడానికి
వీలుగా ప్రీ-మెట్రిక్ విద్యార్థులకు ఎస్.సి.లకు 734, ఎస్.టి. లకు 170, బి.సి.లకు
454, మొత్తం 1,358 వసతి గృహాలను నిర్వహిస్తున్నది. వీటిలో 2016-17 సం.లో 1,34,161
విద్యార్థులకు ప్రవేశం కల్పించబడింది. వారిలో ఎస్.సి. 59,928, ఎస్.టి. 30,882, బి.సి.
43,351 విద్యార్థులు ఉన్నారు.
కళాశాల
విద్యార్థులకు సంబంధించి 153 గిరిజన, 169 ఎస్.సి., 246 బి.సి., మొత్తం 559 వసతి గృహాలను
ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో 18377 ఎస్.టి., 19077 ఎస్.సి., 24517 బి.సి. విద్యార్థులు
2016-17లో ప్రవేశం కలిగి ఉన్నారు. Vవ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ వరకు 'రెసిడెన్షియల్'
విద్యా సంస్థలను ఎస్.సి.ల కోసం 267, ఎస్.టి.ల కోసం 145 నిర్వహిస్తున్నారు. వీటిలో
34,176 మంది విద్యార్థులున్నారు. 2016 మార్చిలో జరిగిన ఎస్.ఎస్.సి. పరీక్షల్లో
81%, ఇంటర్ మీడియేటులో 86% ఉత్తీర్ణులైనారు. బి.సి. విద్యార్థులకు 37 'రెసిడెన్షియల్'
విద్యా సంస్థలను నెలకొల్పి, 11,720 మందికి ప్రవేశం కల్పించబడింది.
కార్మిక శక్తి: మొత్తం కార్మికులు 1,63,41,942, వ్యవసాయదారులు
31,51,389, మెయిన్ కార్మికులు 1,37,19,879, వ్యవసాయ కార్మికులు 59,15,151, మార్జినల్
వర్కర్స్ 26,22,063, కుటీర పరిశ్రమల్లో పని చేసే కార్మికులు 7,76,529, నాన్ వర్కర్స్
1,86,61,732, ఇతర కార్మికులు 64,98,873.
గ్రామీణ ప్రాంతంలో మౌలిక
సదుపాయాలు:
*వ్యక్తిగత మరుగు దొడ్లు 16,63,839 *రక్షిత
త్రాగు నీటి వనరులు 1,85,147
*విద్యుత్తు(ఇంటి
కనెక్షన్స్) 95,04,305
*వ్యవసాయ
విద్యుత్తు కనెక్షన్స్ 20,80,706
*ప్రాథమిక
పాఠశాలలు 21,948
*మాధ్యమిక
పాఠశాలలు 7,189
*ఉన్నత
పాఠశాలలు 11,333
*కళాశాలలు
4,655
*ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలు 683
*ప్రాథమిక
ఆరోగ్య ఉప కేంద్రాలు: 4,797
*అంగన్ వాడి కేంద్రాలు: 35,700
*స్వయం సహాయ బృందాలు: 4,26,705
*సమాచార వ్యవస్థ: ఫోస్టాపీసులు 5,835. టెలిఫోన్ కనెక్షన్స్
5,10,070
*రహదారులు: కంకర్రాళ్ళతో వేసిన రోడ్డులు 16,343
కి.మీ., మట్టి రోడ్డులు18,235 కి.మీ.
*రవాణా సదుపాయాలు: ఆర్.టి.సి. బస్సులు 10,482
*బ్యాంకింగ్ వ్యవస్థ: బ్యాంకు బ్రాంచీలు 5,332
సామాజిక భద్రత పింఛను పథకం(ఆసరా): వృద్ధులకు 13,23,764, వికలాంగులకు
4,55,835, వితంతువులకు 13,32,919, చేనేత కార్మికులకు 34,138, గీత కార్మికులకు
57,434, బీడి కార్మికులకు 3,47,581 ప్రభుత్వం ఇస్తున్నది.
ప్రజా పంపిణీ వ్యవస్థ: చౌక దుకాణాలు 17,159, రేషన్ కార్డులు
79,72,968, అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 5,55,823, అన్నపూర్ణ కార్డులు 5,040 ఉన్నాయి.
టి.లక్ష్మీనారాయణ
No comments:
Post a Comment