Surya Daily Feb.15 2012
సమాజ హితం కోరుకొనే వారెవరైనా మ ద్యం వ్యాపారానికి ప్రత్యక్షంగాగానీ, పరో క్షంగా గానీ భాగస్వాములు కారు. తెలుగునాట మద్యాన్ని ఏరులై పారిస్తూ, కాసుల కోసం కక్కు ర్తిపడుతూ ప్రజల మానప్రాణాలను బలి గొంటూ, పేద పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మాఫి యా గ్యాంగులకు కళ్ళెం వేయాల్సిన ప్రభుత్వ పెద్దలే అవినీతికి పా ల్పడ్డ్డారని అవినీతి ని రోధక సంస్థ (ఎ. సి. బి.) ప్రాథమిక సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసింది. అనైతికమైన మ ద్యంవ్యాపారాన్ని చేయడమే కాకుండా చట్ట ప్రకారమే చేస్తున్నామని బుకా యించడం కొందరి నీతిమాలిన రాజకీయాలకు ప్రబల నిదర్శనం. సమస్య కొత్తది కాకపోయినా తాజాగా మరొకసారి మద్యం మాఫియా అండ్ కంపెనీ గుట్టు రట్టయ్యింది. రాజకీయ, వ్యాపార, పత్రికా రంగాలకు, అధికార గణాని కి తీరని కళంకం తెచ్చి పెట్టింది. ఈ శాసన సభా సమా వేశాల్లోనైనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ తరహా సమస్యలపై సవ్యమైన చర్చలు జరిపి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తారో ! లేదో ! వేచి చూడాలి.
ప్రజల సంక్షేమం, ఆరోగ్యం మా ధ్యేయమని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పాలకులు రక్త పిపాసులుగా మారడం మానవత్వాన్ని మంటకలపడమే. పేద లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే సొమ్ములు కావాలి కదా ! అని ప్రభుత్వ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దారిద్యరేఖకు దిగు వనున్న ప్రజానీకాన్ని ఆర్థికంగా ఆదుకోవడం సంక్షేమ రాజ్యం యొక్క ప్రాథ మిక కర్తవ్యం. రాజ్యాంగబద్ధమైన ఈ కర్తవ్యాన్ని కూడా ప్రభుత్వం నిర్వర్తిం చనప్పుడు ఇ! ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం లేదు. సంక్షేమ పథకాలకు నిథులను సమకూర్చడం సమాజం బాధ్యత. అంతే కానీ సంక్షేమ పథకాల లబ్ధిదారులను మద్యం వ్యసనపరులుగా మార్చి, వారి నుండే నిథుల ను పోగేసుకొంటామంటే ! అది ముమ్మాటికీ అనైతికం.
నీతిమాలిన వ్యాపా రానికి ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలందించే వారెవరైనా రాజకీయాల కు అతీతంగా సమాజం ముందు ముద్దాయిలుగా నిలబడక తప్పదు. అయితే ఆ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. తమపార్టీవారనో, వర్గం వారనో వారిని కాపాడే ప్రయత్నం రాజకీయ నాయకులు, ప్రభుత్వం చేస్తే అంతకు మించిన అపరాధం మరొకటి ఉండదు. మద్యాన్ని విస్తత్రంగా అమ్మడం ఒక ఎత్తు అయితే దానిని ఎంఆర్‌పి రేట్లకు మించి అమ్మడం మరొక దారుణం.
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశ పెట్ట బోతున్నది. కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తాలను, మద్యం అమ్మకాల (ఎకై్సజ్) ద్వారా ఆర్జించ తల పెట్టిన రాబడి అంకెలను పరిశీలించండి. ప్రభుత్వ శాఖ పేరు ప్రొహిబిషన్ అండ్ ఎకై్సజ్ డిపార్ట్‌మెంట్, మద్యపానం వల్ల సంభవించే దుష్పలితాలపై ప్రజ ల్లో విస్తృతంగా ప్రచారంచేసి, వ్యసనపరులను చైతన్యపరచి, మద్యాన్ని సేవిం చకుండా నిరుత్సాహ పరచడం శాఖ ప్రధాన కర్తవ్యం. ఈ లక్ష్యంతో ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీల ఉనికే గల్లంతయ్యింది. బాధ్యతను మరచిన ఎకై్సజ్ శాఖ మద్యం వ్యాపారంలో నిమగ్నమై పోయింది. మద్యం ఉత్పత్తి, నిల్వ, కొనడం, అమ్మడం, రవాణా వగైరా కార్యకలాపాలు నిర్వహి స్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా మద్యం ఉత్పత్తి ని పెంచి, అమ్మకాలను పెంచుతారు.
మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజు, అమ్మ కం పన్ను, ఎకై్సజ్ డ్యూటి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతులాంటిది ఎకై్సజ్‌శాఖ. మద్యం వ్యాపారస్తులు సిండికేట్‌లుగా ఏర్పడి వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించు కొంటున్నారు. ఆ మాఫియా గ్యాంగ్స్ తో మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులు చేతులు కలిపి అప విత్ర కూటమిగా ఏర్పడి అక్రమార్జనను, అవినీతిని, నేరాలను వ్యవస్థీ కృతం చేశారు .
మద్యం షాపులకు అత్యధిక మొత్తాల చెల్లింపుకు మాఫియా గ్యాంగ్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ టెండర్లు వేసి వేలంలో పాట పాడుకొంటు న్నారు. సిండికేట్లుగా తయారై మద్యం వ్యాపార వ్యవస్థనే నియంత్రిస్తు న్నారు. సొంతంగాను, బినామీ పేర్లతోనూ షాపులను కైవసం చేసుకొని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు, అమ్మకపు పన్ను, ఎకై్సజ్ పన్ను చెల్లించాలి. చట్టం కళ్ళు కప్పి సాగించే అక్రమార్జనకు అడ్డు లేకుండా చేసుకోవడానికి మంత్రు లు, ప్రజాప్రతినిథులు, ఎకై్సజ్, పోలీసు, తూనికలు కొలతలు వగైరా ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులు, సిబ్బందికి క్రమం తప్పకుండా నెలవారి లంచా లు, కమీషన్లు ముట్టజెప్పుకోవాలి.
పైనుంచి క్రిందికి గొలుసులా అవినీతి పరుల బంధం వ్యవస్థీకరించబడి ఉన్నది. రక్షణ కవచంగా గూండాలను పోషించాలి. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వాలి. దిన పత్రికలు, టి.వి. చానల్స్ యాజమాన్యాలు విలేకరులకు చట్టబద్దమైన వేతనాలు చెల్లించక పోవడంతో వారూ అవినీతికి పాలడుతూ లంచాలకు కక్కుర్తిపడు తున్నారు. చట్టబద్ధమైన, చట్టవ్యతిరేకమైన ఖర్చులను భరిస్తూ కోట్లకు కోట్లు ఆర్జించాలంటే మద్యం వ్యాపారులు చట్టాన్ని, ప్రభుత్వ నిబంధ నలను తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన షాపు లు దాదాపు 7,000 , బార్ అండ్ రెస్టారెంట్స్ 1,500 ఉంటే అనుమతి లేని బెల్ట్ షాపులు లెక్కకు మించి పదుల వేల సంఖ్యలో నిర్వహించబడుతున్నాయి.
నిషేధిత ప్రాంతాలైన ఆలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు వగైరా ప్రదేశాలు, జాతీయ రహదారుల వెంబడి కూడా నిర్భీతిగా షాపులను ఏర్పాటు చేసి, గరిష్ట అమ్మకపు ధర (యం. ఆర్.పి.)పై కనీసం యాభై శాతానికి మించి డిమాండుకు అనుగుణంగా అధిక ధరలకు అమ్ముతూ మద్యం వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తున్నది. మరోవైపు కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకొంటున్నా చీమ కుట్టినట్లు కూడా లేక పోవడం పాలకుల నిర్వాకాన్ని తెలియజేస్తున్నది. కల్తీ మద్యాన్ని అరికట్టేం దుకు చర్యలు తీసుకోకపోవడమే కాదు తాగినవారిదే తప్పు అయినట్టుగా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకొంటున్న ప్రభుత్వం ఎకై్సజ్ శాఖ నుండి రూ. 20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అంటే నలభై యాభైవేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. సబ్సిడి బియ్యం పంపిణీపై రూ. 2,500 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంపై రు. 2,000 కోట్లు, సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య, వితంతు, వికలాం గులకు ఇస్తున్న ఫించన్లు వగైరా సంక్షేమ పథకాలకు రూ.2,000 కోట్లు , ఇలాగా వివిధ సంక్షేమ పథకాలకు మొత్తంగా వెచ్చిస్తున్నది ఏడెనిమిది వేల కోట్ల రూపాయలకు మించి ఉండదు. కానీ ప్రజానీకాన్ని మద్యం మత్తులోకి నెట్టి గుంజుకొంటున్నది రూ. 50,000 కోట్లు.
ఈ రంగంలోని వ్యాపారానికి సంబంధించిన మొత్తం లావాదేవీలపై అధికారిక లెక్కలు సంపాదించడం దుర్లభం. అందుకే, సింగిల్ విండో విధానంలో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తే బాగుంటుందని కొందరు ప్రముఖులు వ్యంగంగా సలహా ఇచ్చారు. అప్పుడ న్నా లెక్కాపక్కా తేలుతుందని, కనీసం జవాబుదారీతనం ఉంటుం దేమోనన్న ది వారి అభిప్రాయం కావచ్చు .
2జి స్కాంలో రూ. 1,76, 000 కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్ అంచ నా వేయగలిగింది. రాష్ట్రంలో యధేచ్ఛగా సాగిపోతున్న మద్యం కుంభకో ణంలో అవి నీతి సొమ్మెంతో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అవినీతి నిరోధక సంస్థ (ఎ.సి.బి.) దాడుల్లో జిల్లాల వారిగా వెలుగు చూస్తున్న వాస్త వాలు నామ మాత్రమే. గుడ్డి కంటి కంటే మెల్ల మేలన్న నానుడిగా రాష్ట్ర ప్రభు త్వం ఎ.సి. బి. దాడులకు ఆదేశించడం ఆ మేరకు అభినందనీయమే. కానీ దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలన్నింటినీ బహిర్గతం చేయకుండా, రాజకీ య స్వప్రయోజనాల కోసం ఏ.సి.బి. నివేదికల్ని ఆయుధంగా వాడుకొంటే అంతకంటే నీచమైన చర్య మరొకటి ఉండదు. ఇప్పటికే ఎసిబి దాడులను ఆదేశించడానికి కారణాల గురించి అధికార పార్టీ నాయకులే పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కనుక స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, రాజకీయ వత్తిడులకు లొంగకుండా అన్ని జిల్లాలలో దాడులు కొనసాగించి, మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి బహిర్గతం చేయాలి. అక్రమార్జనపరులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలరు.
No comments:
Post a Comment