పట్టిసీమపై శాసనసభ చర్చ-2
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబధించి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో ఏడాదిలోపు విధిగా నిర్మించాలి అన్న షరతు విధించబడిందని శాసనసభలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖామాత్యులు ప్రకటించారు. ఆ షరతుకు అంగీకరించిన సంస్థలే టెండర్లు వేసి ఉంటాయి. మరి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తే 16.9% బోనస్ ను నిర్మాణ సంస్థకు ఎందుకివ్వాలి? నిర్మాణ వ్యయాన్ని, లాభాన్ని అంచనా వేసుకొనే కదా! టెండర్ వేసి ఉంటారు? సంవత్సరాల తరబడి నిర్మాణ పనులు జరిగితే ధరలు పెరిగాయని, గిట్టుబాటు కాలేదని, నిర్మాణ సంస్థలు పేచీ పెట్టి నిర్మాణ పనులను కొనసాగించకుండా తలాడించడాన్ని చూస్తుంటాము. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి విధించిన గడువు ఏడాదే కదా! ఈ ఏడాదిలో అనూహ్యమైన ధరల పెరుగుదల ఉంటుందా? గత ప్రభుత్వాలు 24%, 25% బోనస్ ఇచ్చాయని, మేము 16.9% మాత్రమే బోనస్ గా ఇస్తామని ఒప్పుకొన్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పడంలో డొల్లతనం కనబడుతున్నది. గత ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయనే కదా! వారిని ఓడించి వీళ్ళకు అధికారాన్ని అప్పగించింది? ప్రజాధనాన్ని పంది కొక్కుల పాలుజేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.

No comments:
Post a Comment