https://www.youtube.com/watch?v=SkYWOyYWXnE
Wednesday, April 29, 2015
6టీవిలో ఏప్రిల్ 28 రాత్రి 'టిటిడి పాలక మండలి నియామకం _ సభ్యుల అర్హతలు' అన్న అంశంపై జరిగిన ప్రత్యేక చర్చలో నాతో పాటు ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి లక్ష్మీపార్వతి, వి.హెచ్.పి.నాయకులు శ్రీ శశిధర్ పాల్గొన్నారు. టిటిడి పాలక మండలి నియామకంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, సభ్యులకు ఉండవలసిన అర్హతలు, టిటిడి నిర్వర్తించాల్సిన సామాజిక బాధ్యత, టిటిడి ఆర్థిక సహకారంతో నెలకొల్పబడిన విద్యా, వైద్య సంస్థలలో ఇతర మతాలకు చెందిన వారు ఉద్యోగాలకు, పదోన్నతులకు అనర్హులా! కాదా! అన్న పలు అంశాలపై చర్చ జరిగింది. నేను కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాను. నేను మాట్లాడే సందర్భంలో వి.హెచ్.పి.నాయకులు కాస్త అడ్డుతగిలి మాట్లాడడంతో నేనూ కాస్త నోరుపెంచి మాట్లాడాల్సి వచ్చింది. ఆసక్తి ఉన్న మిత్రులు చూసి హేతుబద్ధమైన నిర్ధారణకు రాగలరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment