Saturday, June 20, 2015

లలిత్ మోడీ..సుస్మాస్వరాజ్..వసుందర రాజే: వివాదం

ఐపియల్ కుంభకోణం ద్వారా రు.1,700 కోట్ల అవినీతికి పాల్పడిన కేసులో ప్రధాన‌ నింధితుడైన‌ లలిత్ మోడీ విచారణ నుండి తప్పించుకొని పారిపోయి లండన్ లో తలదాచుకొంటున్నాడు. ఆయనను భారత దేశానికి రప్పించి త్వరితగతిన విచారణను పూర్తి చేసి నింధితులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. గత ప్రభుత్వం లలిత్ మోడీ పాస్ పోర్టును రద్దు చేసింది. డిల్లీ హై కోర్టు 2014 ఆగస్టులో పాస్ పోర్టు రద్దు ఉత్తర్వును చెల్లదని తీర్పు చెప్పింది. దానిపై పది మాసాలు గడచిపోతున్నా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫీల్ చేయలేదు. లలిత్ మోడీ లండన్ నుండి పోర్చుగల్ వెళడానికి వీసా ఇవ్వాలని బ్రిటీష్ ప్రభుత్వానికి మన‌ విదేశాంగ మంత్రి శ్రీమతి సుస్మాస్వరాజ్ సిఫార్సు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుందరా రాజే బ్రిటీష్ ప్రభుత్వానికి సిఫార్సు చేయడమే కాకుండా తాను సిఫార్సు చేసిన విషయం ఏ మాత్రం బయటికి పొక్కరాదని, భారత ప్రభుత్వానికి తెలియ కుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్థిక కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఒక నింధితునికి తోడ్పడిన కేంద్ర మంత్రి, రాజస్తాన్ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం, బిజెపి అండగా నిలవడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొస్తామని, అవినీతిరహితమైన నీతివంతమైన సుపరిపాలనను అందిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు దీనిపై స్పందించక పోవడాన్ని బట్టి మౌనం అర్థాంగీకారమని భావించాల్సి వస్తున్నది. ఈ అంశంపై మ‌హా టీవి నిర్వహించిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు డా. యన్. తులసిరెడ్డి, బిజెపి నాయకురాలు మ‌రియు మాజీ రాష్ట్ర మంత్రి శ్రీమతి పుష్పలీల గారు పాల్గొన్నారు. ఆ చర్చకు సంబంధించిన రెండు యూట్యూబ్ లి‍ంక్స్. 
https://www.youtube.com/watch?v=SIdKNs_oT-o
https://www.youtube.com/watch?v=ErCCim_TBnY

No comments:

Post a Comment